ఘనంగా 99వ సత్యసాయి జన్మదిన వేడుకలు . భారీ సంఖ్యలో భక్తులు. ప్రేమావతారి సత్యసాయి.

ఘనంగా సత్య సాయి 99 వ జన్మదిన వేడుకలు... సత్యసాయి వ్రతాలు భారీ సంఖ్యలో మహిళలు. )మధురవాడ, ప్రజా బలం న్యూస్ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో 99వ జన్మదినోత్సవo పురస్కరించుకొని పీఎం పాలెం సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో కన్వీనర్ సాయి దూత ప్రభాకర్ పర్యవేక్షణలో ఈనెల 18 నుంచి ప్రారంభమైన సత్యసాయి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సత్యనారాయణ స్వామి వ్రతం, పల్లకి ఊరేగింపు, మున్సిపల్ కార్మికులకు,పేదలకు అమృతకాల పంపిణీ, భారీగా నారాయణ సేవ జరిగింది.. మహానగర్ సంకీర్తన, యూత్,బాలవికాస్ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామి వారి జన్మదినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నగర సంకీర్తన,నామ సంకీర్తన ఘనంగా జరిగాయి.. మెంటల్ హాస్పిటల్ లో సుమారు 350 మందికి నారాయణ సేవ చేశారు. పేదలకు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేశారు.