కొమ్మాది శ్రీ రాములోరి భూములకు ఎసర పెట్టిన ఆ ఊరు పెద్దలు.ఆ గ్రామస్తులు ఫిర్యాదుతోహెచ్చరించిన భీమిలి ఎమ్మెల్యే గంటా . తగిన చర్యలు తీసుకోవాలని రెవిన్యా అధికారులకు ఆదేశం. వెంటనే స్పందించిన గంటాకు స్థానికులు జేజేలు

(భీమిలి నియోజకవర్గం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
కొమ్మాది గ్రామ శ్రీరాములు వారి దేవాలయ భూముల క్రయ విక్రయాలకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెవిన్యూ అధికారులను ఆదేశించారు. కొమ్మాది గ్రామ సర్వే నెంబర్ 84 లోని 31సెంట్లు భూమికి స్థానిక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కాకుండా పెదగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారని కొమ్మాది గ్రామ ప్రాంతానికి చెందిన పలువురు శనివారం ఎమ్మెల్యే ని కలిసి ఫిర్యాదు చేశారు. మొత్తం 1,500 గజాల రామాలయం స్థలాన్ని రెండు 750 గజాల సైట్లుగా విభజించి తప్పుడు రిజిస్ట్రేషన్ కు పాల్పడ్డారని వారు చెప్పారు. ఈ వ్యవహారంలో ఎంతటి వారైనా ఎవరినీ ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని గంటా స్పష్టం చేశారు. ఇట్లు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి కార్యాలయం, విశాఖపట్న0.