పైడి మాంబ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం--- భారీ అన్న సమారాధన ,
November 18, 2024
అంగరంగ వైభవంగా శ్రీ పైడిమాంబ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం.
- మూడు రోజులు ప్రత్యేక పూజలు..హోమాది కార్యక్రమాలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ.
- కోలాట నృత్యాల నడుమ కనుల పండుగగా అమ్మవారి విగ్రహ ఊరేగింపు.
- శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు..పంచామృతాభిషేకం.
- భారీ అన్నసమారాధ పోటెత్తిన భక్తులు
(మధురవాడ -(( ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను) 19): శ్రీ పైడిమాంబ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. విశాఖపట్నం మధురవాడలోని డాక్ యార్డు కోలనీలో నిర్మించిన శ్రీ పైడిమాంబ అమ్మవారి దేవాలయంలో సోమవారం విగ్రహ ప్రతిష్ఠను శతాధికా ప్రతిష్టాచార్యులు అధికార్ల కాళిదాసు బృందం ఆధ్వర్యంలో మంత్రోచ్ఛరణ మధ్య భక్తుల కోలాహలంగా నిర్వహించారు.సోమవారం ఉదయం యంత్ర పూజలు, ఆదివాస హోమం, నవ దుర్గా హోమం జరిపారు . ఉదయం 11:11 నిమిషాలకు అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, బలిహరణం, నేత్రోన్మిలనం దృష్ణ కుంభం వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. అమ్మవారి విగ్రహ, ధ్వజస్తంభ ప్రతి ష్ఠానంతరం పూర్ణహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నవంబర్ 16 నుండి 18 వరకు మూడు రోజుల పాటు జరిగిన అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా మొదటి రోజు ఉదయం మహాగణపతి పూజ, పుణ్యహవచనం, రక్షా బంధనము, బుుత్విక్కరణము, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, ప్రధాన కలశాహ్వానము, అగ్ని ప్రతిష్ట, అధివాస హోమం, మృతికస్థానం వంటి కార్యక్రమాలను నిర్వహించారు . అదే రోజు సాయంత్రం సాయంత్రం 6 గంటలకు గణపతి హోమం, మూర్తి హోమం, లక్ష్మీగణపతి హోమం, దుర్గా హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.రెండవ రోజు ఆదివారం ఉదయం వేదవిన్నపం, స్థాపిత పూజలు, కలశ పూజలు, అమ్మవారికి పంచామృతాభిషేకం, జలాధివాసం జరిపారు. సాయంత్రం అమ్మవారి ఊరేగింపు, దాన్యాధివాసము, ఫలాదివాసము, శయ్యాధివాసము, పుష్పనివాసము వంటి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో
టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు, బంగారు అశోక్ కుమార్, నక్కాన శ్రీధర్ ,చిన్నం నాయుడు.. వివిధ గ్రామాల
ప్రజాప్రతినిధులు,భక్తులు పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ సలహాదారులు వి .నాగమ్మ ,ఎస్ .పాపమ్మ ,ఆర్.నారాయణమ్మ ,యం.బుడ్డమ్మ ,ఆలయ కమిటీ అధ్యక్షులు వై .ఎర్రన్న ,ఉపాధ్యక్షులు ఆర్ .లోకేష్ ,కోశాధికారి ఎస్ .సాయి ,సెక్రెటరీ యు .లోకేష్ జాయింట్ సెక్రెటరీ ఎస్ .పవన్ సభ్యులు డి .సింహాచలం ,జి. ఈశ్వరావు ,డి .రామయ్య ,వై .ఆదినారాయణ ,బి .సురేష్ ,పి .అర్జున్ ,బి .దీనా ,పి .గోవింద్ ,బి .జైరామ్ ,వై .నవీన్ ,జి .నూకరాజు ,ఎన్ .రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.