ఘనంగా కార్పొరేటర్ హేమలత జన్మదిన వేడుకలు.
November 07, 2024
ఘనంగా 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత జన్మదిన వేడుక.!
(భీమిలి నియోజకవర్గం, ప్రజా బలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) మధురవాడ )నన్ను నమ్మిగెలిపించిన వార్డు ప్రజల కోసం అహర్నిశలు సహయసహకారాలు అందించడం లోనే అసలైన ఆనందం పొందుతున్నానని 5వ వార్డు కార్పొరేటర్ మొల్లిహేమలత పేర్కొన్నారు. బుధవారం నాడు 5వ వార్డు కార్పొరేటర్ హేమలత పుట్టిన రోజు వేడుకలు బొట్టవానిపాలెం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోన్ 2 కమిషనర్ పి సింహాచలం, ఏపీడి శ్రీరామ్ పాల్గొని కార్పొరేటర్ హేమలత కు వారు దీవెనలు అందించి,శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే టిడిపి సీనియర్ నాయకులు వాండ్రాసి అప్పలరాజు,బోయి శ్రీనివాస్, రమాదేవి,నమ్మి శ్రీను,నాగోతి సత్యనారాయణ,ఈగల రవి, ఆధ్వర్యంలో టిడిపి సీనియర్ నాయకులు,రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు కుమార్తి అయిన కార్పొరేటర్ మొల్లి హేమలత కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఘనసన్మానం నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వమత వేదపండితులు ఆశీస్సులు అందించారు.ఈసందర్భంగా కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ..జన్మదిన శుభాకాంక్షలు అందించిన వారికి,పార్టీ పెద్దలు, యువత,కార్యకర్తలు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నానని తెలియజేశారు.స్థానిక సమస్యలపై నిరంతరం కృషి చేస్తానని,వార్డులో ఎటువంటి సమస్యలుఉన్న వెంటనే పరిష్కరిస్తానని,ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వార్డ్ అభివృద్ధికి సుమారు 8 కోట్లతో అభివృద్ధి పనులకి నా పుట్టినరోజు నాడు శంకుస్థాపన జరగవలసినదని కొన్ని అనివార్య కారణముల చేత ఆ కార్యక్రమం వాయిదా పడిందని, తొందర్లోనే అభివృద్ధి పనులు అన్నిటిని ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు. టిడిపి శ్రేణులు అందరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని,సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రూ.ఐదు లక్షల ప్రమాద బీమా సదుపాయం లభిస్తోందన్నారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు పిల్లా వెంకటరావు, పోతిన నాయుడు, చలమోలు శ్రీనివాసరావు, ఆవాల నేలయ్య, కొండపు రాజు, జనసేన నాయకులు దేవర శివ, ఎడ్ల గణేష్, ఈమంది శ్రీనివాసరావు, నరేష్, టిడిపి సీనియర్ నాయకులు బొడ్డేపల్లి రంగారావు, కరుమోజు గోవిందరావు, కంబపు కామరాజు, కొత్తల శ్రీనివాసరావు, జోగేశ్వరరావు పాత్రో, వైకుంఠరావు, రోనంకి నారాయణరావు, దుర్గారావు, యోగేశ్వరరావు, మన్మధరావు, జగన్నాధ రావు, పాపారావు, ఈగల అప్పలనాయుడు, బోర అప్పల సూరిబాబు రెడ్డి, వెంకటరెడ్డి, శారదానగర్ నాయకులు నల్లాన ఆనందరావు, రమణమ్మ, నారాయణశెట్టి చక్రపాణి, మాచర్ల నాగేశ్వరరావు, అప్పారావు, అవ్వ కృష్ణ, సకల ప్రసాద్, మహిళ నాయకురాలు సరస్వతి, అనిత, సునీత, కృష్ణవేణి, ప్రసన్న,లక్ష్మమ్మ, అన్నపూర్ణమ్మ, నూకరాజు, శ్రావణ్, మొకర రవికుమార్, మదీనా, విష్ణు, మాధవ, హరికృష్ణ, గీత, మాధాల విజయ్ , పొట్టి నారాయణరావు, అన్నపురం మూర్తి, బొట్ట కనకరాజు, టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.