పట్టణాల్లో పేదలకు రెండు సెంట్లు ఇల్లస్థలాన్ని ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి,--సిపిఐ డిమాండ్.. పేదలతో భారీ నిరసన ప్రదర్శన.

కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పట్టణాలలో పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి - సిపిఐ . (భీమిలినియోజవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్:సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను, పాత మధురవాడ మెట్ట) పాతమధురవాడ మెట్ట నుండి సచివాలయం వరకుసిపిఐ ఆధ్వర్యంలో పేదలు గురువారం నిరసనప్రదర్శనచేశారు భారీ సంఖ్యలో పేదలు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్లస్థలాల పట్టాలు ఇచ్చారని ఆఇళ్లస్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యంకాని ప్రాంతాలలో కేటాయించారని అందులో చాలామంది పేదలకు ఇప్పటివరకు ఇళ్లస్థలాలు చూపలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే 1 సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం సరిపోదని సిపిఐ ఆనాడే వైసిపి ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతరు చేయకుండా మొండిగా ముందుకెళ్లిందని, కాకి లెక్కలతో 32 లక్షల మందికి ఇళ్లపట్టాలు యిచ్చినప్పటికీ పేదలు ఆ స్థలాలపట్ల సుముఖత చూపలేదు పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం రూ. 1,80,000/-లు మాత్రమే ప్రకటించారని ఆ ఆర్థిక సహాయంతో పునాదులు కూడా పూర్తిచేయలేమని పేదలెవ్వరూ కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేదన్నారు. వైసిపి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాలు, పట్టాలు నిరుపయోగంగా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్లస్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా హామీ ఇస్తూ, ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షల చొప్పున ఇస్తామని చెప్పారని, ఇంటి స్థలాల కేటాయింపు పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సానుకూలమని అందుకు సిపిఐ స్వాగతిస్తున్నాదని, సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుము, కంకర తదితర సామాగ్రి ధరలు పెరిగిన రీత్యా రూ. 5 లక్షలకు పెంచి గృహ నిర్మాణానికి మంజూరు చేయాలని సిపిఐ తరుపున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఇళ్లస్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో, గ్రామాల్లో నివాసయోగ్యంమైన, గృహ నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని కోరారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన లే-అవుట్లను మార్పుచేసి పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్లస్థలాలను కేటాయించాలి. రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజీ పారుదల వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని అన్నారు. అనంతరం 53 వ సచివాలయ నిర్వాహాక కార్యదర్శి బి వెంకటరావు గారికి వ్యక్తిగత ధరకాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యురాలు ఎం డి బేగం, పార్టీ శాఖ కార్యదర్శి కె కుమార్, ఎం ఎస్ పాత్రుడు, ఎన్ త్రినాధ్, కె చిన్న, రమ్య, మణి, సంతోష్, కనక, తౌటమ్మ, కృష్ణమ్మ, తదితరులతో పాటు పాత మధురవాడ మెట్ట పేద ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.