సోమ సుందర్, ఆరుద్ర శత జయంతోత్సవాలు. ఏ యూ లో.ఘనంగా ప్రారంభం
November 25, 2024
విశాఖపట్నం, )(ప్రజా బలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) అవంత్స సోమసుందర్, ఆరుద్ర శత జయంతి ఉత్సవాలు ఆంధ్రవిశ్వ విద్యాలయం తెలుగు శాఖ, అరసం సంయుక్తంగా ఏ యు లో నిర్వహించడం ముదావాహమని ఏయు ఉప కులపతి ఆచార్య జి శశిభూషణరావు అన్నారు. మంగళవారం ఏయు టి ఎల్ ఎన్ సభా హలులో తెలుగు శాఖాదిపతి ఆచార్య జర్రా అప్పారావు అధ్యకతన జరిగిన విరిద్దరి శత జయంతి ప్రారంభించి, అరసం ప్రచురించిన "ఆరుద్ర కవిత " ను ఆవిష్కరణ చేసిన వి సి మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేటట్లు విరిద్దరూ కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం కామ్రేడ్ వై విజయకుమార్ మార్కిస్ట్ అధ్యయన కేంద్రం నిర్వాహకులకు జె వి సత్యనారాయణమూర్తి, అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మినారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం విశ్రాంతి ఆచార్యుడు మేడిపల్లి రవికుమార్, ఆచార్య చందు సుబ్బారావు, ఆచార్య వెలమల సిమ్మన్న, అరసం నాయకులు ఉప్పల అప్పలరాజు, సి ఎన్ క్షేత్రపాల్ రెడ్డి తెలుగు శాఖ విద్యార్థులు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు.