ఆధ్యాత్మిక సేవతోనే ఆత్మసంతృప్తి.... దైవ నామ స్మరణతో ప్రశాంతత.... నారాయణ సేవలోదైవ సేవకుడు అవంతి...
November 04, 2024
స్వామి వారి సేవలో మాజీ మంత్రి అవంతిశ్రీనివాస్.
(ప్రజా బలం న్యూస్ ఆన్లైన్,: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను పాత మధురవాడ )
భీమిలి నియోజకవర్గం (పద్మనాభం మండలం) - 04-11-2024 - సోమ వారం
పద్మనాభం మండల పరిషత్ అద్యుక్షులు కంటుబోతు రాంబాబు ఆధ్వర్యంలో సోమవారం మద్ది గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర సేవా పీఠం ప్రథమ వార్షికోత్సవ మహాత్సవం కి మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా
ఉత్సవంలో బాగంగా అవంతి ప్రత్యేకపూజలు చేశారు. స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకుని అనంతరం మహా నారాయణ అన్నదాన సేవా కార్యక్రమం లో పొల్గొని భక్తులు కు అన్న ప్రసాదాలు అందజేశారు
అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వ మానవాళిని రక్షించేది కేవలం దైవశక్తి అని, మానవుని జీవితంలో ప్రతీ ఒక్కరికీ దైవశక్తి పై దృడమైన విశ్వాసం కలిగి ఉండాలని,నా జీవితంలో రాజకీయం, వ్యాపారం ఎన్ని ఉన్నా నా ప్రథమ స్థానం నిత్యం దైవ ఆరాదనకే ప్రాధాన్యత ఇస్తానని,ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగానంటే కేవలం దైవశక్తి తోడు,నేను శాసనసభ్యులు గా ఉన్నప్పుడు ఈ ధర్మశాస్త్ర సేవా పీఠం నిర్మాణం కి శ్రీకారం చుట్టడం జరిగింది అని మరల నేను అదే సేవా పీఠం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు లో పాల్గొని దైవాశిస్సులు పొందడం ఓ వరం గా భావిస్తున్నానని,దైవ నామస్మరణ లో శాంతి సమాధానం దొరుకుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సేవా పీఠం కార్యాచరణ వర్గం - నియోజకవర్గం నాయకులు - భక్తులు పాల్గొన్నారు.