ఉచిత మెడికల్ క్యాంపు, కార్తీకమాస సందర్భంగా ఏర్పాటు చేసిన శిరిడి పద్మ సాయి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్.

షిరిడి సాయిబాబా ఆలయం ప్రాంగణంలో ఉచిత మెడికల్ క్యాంపు. (భీమిలి నియోజకవర్గO,మధురవాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )కార్తీక మాసం పురస్కరించుకొని పీఎం పాలెం చివరి బస్ స్టాప్ ఎల్ ఐ జి కాలనీ లో వెలసినశ్రీ షిరిడి పద్మ సాయి ఆలయ ఆవరణలో గురువారం భక్తులకు మెడికవర్ హాస్పటల్ వారి సౌజన్యంతో అందరికీ బిపి, షుగర్, ఈసీజీ టెస్టులు ఉచితంగా చేసి మందులు పంపిణీచేశారు. త్వరలోనే మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మహిళలకు గైనిక్ సమస్యల మీద క్యాన్సర్ టెస్టులు హార్ట్ కి సంబంధించిన పూర్తి పరీక్షలు అన్నీ ఉచితంగా చేసే విధంగా నగరంలో ఉన్న ప్రముఖ వైద్యులు చే అన్ని విధాలైన ఆరోగ్యం సమస్యలు పై ఉచిత కన్సల్టేషన్, మందులు పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా షిరిడి పద్మ సాయి ఆలయ అభివృద్ధి అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు అన్నారు.