ఉత్తరాంధ్ర తెలగ ఉద్యమ నేత,యువ నాయకుడు పల్లంట్ల రామారావు జన్మ దినోత్సవ వేడుకలు. విజయనగరం తరలి వెళ్లిన ఉత్తరాంధ్ర తెలగ కులస్తులు. పలు సేవా కార్యక్రమాలు.

(ఉత్తరాంధ్ర, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ
) ఉత్తరాంధ్ర తెలగకుల ఉద్యమ నేత పల్లంట్లవెంకట రామారావు (PVR) జన్మదిన వేడుకలు ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఘనంగా జరిగాయి. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి గుడి దగ్గరలో ఉన్న వికలాంగుల పాఠశాల(భవిత కేంద్రం)లో, శ్రీ సంతోష్ మనో వైకల్య కేంద్రం,అమ్మ అనాధ శరణాలయం, వృద్ధాశ్రయాలలోఘనంగా నిర్వహించి "అన్న సంతర్పణ" ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలగ సంఘ నాయకులు కొంపిల్లి కిరణ్ రమణ, గర్లంకి శ్రీనివాసరావు, బాలబొమ్మ శ్రీనివాసరావు, మానం ఈశ్వరావు తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు