విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పోరాటం చేస్తాం, .ఎంపీ విజయసాయిరెడ్డి.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణపై చంద్రబాబు చేతులెత్తేశారు. ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతోంది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతాం ఎంపీ విజయసాయిరెడ్డి . (విశాఖపట్నం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతామని వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్,ఎంపి విజయసాయి రెడ్డి అన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ గా పార్టీ అధిష్టానం నియమించిన తర్వాత ఆయన విశాఖలో మాజీ మంత్రి , జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,నియోజకవర్గ సమన్వయకర్తలతో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణను చంద్రబాబు నాయుడు పూర్తిగా విస్మరించారన్నారు. లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వేల కోట్లకు విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. తాము మొదటి నుంచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేయడం కోసం ఉత్తరాంధ్రకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.అందులో భాగంగానే ఆర్.బి.ఐ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖ నుండి అమరావతి తరలించే కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుందని, భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో నియోజకవర్గాల సంఖ్య 44 పెరుగుతాయన్నారు. మహిళా కోటాతో &పాటు రిజర్వేషన్లు పలుచోట్ల మారతాయని వివరించారు. ఈ పరిణామాలన్నిటిని చర్చించుకుని రాబోవు ఎన్నికలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. తాము అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిన మాట నిజమేనని వెల్లడించారు. ఇప్పటి నుంచి కార్యకర్తల అభివృద్ధికి పాటు పడతామని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయం సాధించే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఈ సమావేశం లో మాజీ ఉప ముఖ్య మంత్రి బూడి ముత్యాల నాయుడు మాజీ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్, నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి , జిల్లా పరిషత్ చైర్మన్ సుబ్రద , శాసన సభ్యులు రేగు మత్య లింగమా , శాసన మండలి సభ్యులు వరుదు కళ్యాణి , రవి బాబు , మాజీ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, కన్నా బాబు రాజు , కంబాల జోగులు, పెట్ల ఉమా గణేష్ , అదిప్ రాజు , చింతలపూడి వెంకట రామయ్య , భాగ్యలక్ష్మి , శోభ హైమవతి , సమన్వయ కర్తలు కేకే రాజు , మలసల కిషోర్ , పి వరలక్ష్మి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, గుడిమెట్ల రవి కుమార్ (రవి రెడ్డి), ఉరుకూటి అప్పారావు రాష్ట్ర మాజీ చైర్మన్లు పార్టీ ముఖ్య నాయుకులు పాల్గొన్నారు..