. చంద్రంపాలెం దుర్గా లమ్మ ఆలయ ప్రాంగణంలో హనుమాన్ వ్రతం.
December 10, 2024
భీమిలి నియోజకవర్గం,మధురవాడ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో ఈ నెల హనుమద్ వ్రతం
మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకునిగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తేది 13/12/2024 శుక్రవారం *హనుమద్* *వ్రతం* కార్యక్రమం ఘనంగా జరుపబడును,
కార్యక్రమాలు
ఆదివారం ఉదయం 7:00 గంటలకు పంచామృత సుగంధ జాలాభిషేకం, 8:00 గంటల నుండి 9:00 వరకు వివిధ రకముల ఫలాలతో ( యాపిల్, బత్తాయి, నారింజ, దానిమ్మ , జామ, పైనాపిల్ మొదలగు ఫలాలతో అలంకరణ చేయడం జరుగుతుంది, అనంతరం సిందూరర్చన, తమలార్చన (నాగవళ్లీ దళార్చన), పుష్ప అర్చన మొదలగు పూజ కార్యక్రమాలు, ప్రసాదాలు పంపిణి జరుపబడును,
కావున భక్తులు యావన్మంది హనుమద్ వ్రతం కార్యక్రమంలో పాల్గొని స్వామి దర్శించి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి కృపకు పాత్రులు కాగాలని కోరుచున్నాము.
*గమనిక*
భక్తులు ఎవరైనా ఆంజనేయ స్వామి వారి అలంకరణకు ఫలములు గాని, తమలపాకులు గాని, ఆ రోజు పంపిణి చేయడానికి ప్రసాదాలు గాని ఇవ్వదలచుకుంటే
తేదీ 12/12/2024 గురువారం సాయంత్రంలోగా ఆలయంలో అందజేయగలరు
కమిటీ ఫోన్ నంబర్స్
8520078655
9666621156
9866005705
గుమస్తా నెంబర్ 939-168-2543,
ఆలయ అర్చకులు
9491901018.
ఈ సమాచారం ప్రెస్ తెలియజేసిన వారు శ్రీదుర్గాలమ్మ ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ సెక్రటరీ నాగోతి తాతారావు, ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, హరిస్వామి తదితరులు తెలిపారు.