లీడర్ పత్రికా సంపాదకులు రమణమూర్తికి సీఎం చంద్రబాబు చేతుల మీదగా ఘన సన్మానం.

లీడర్ రమణమూర్తికి సీఎం చంద్రబాబు ఘన సత్కారం అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం. విశాఖపట్నం(
మధురవాడ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు. అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో 'తారక రామం.. అన్న అంతరంగం' పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో భాగస్వాములైన పలువురు జర్నలిస్టులను సన్మానించారు. ఇందులో భాగంగా లీడర్ దినపత్రిక సంపాదకులు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణ మూర్తిని సీఎం చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఘనంగా సత్కరించారు. జ్ఞాపికను అందజేశారు. ఎన్టీఆర్ మొదటి సినిమా 'మన దేశం (1949)' విడుదలై 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా విజయవాడ శివారు పోరంకిలో ఉన్న మురళీ రిసార్ట్స్ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో సినీ వత్రోత్సవం నిర్వహించారు. ముఖ్యమంత్రితో పాటు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానులు, సినీ కళాకారులు, టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రాల్లోని పాత్రలను ప్రదర్శిం చారు. ఆయన చిత్రాల్లో గీతాలను ఆలపించారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవిత చరిత్రకు సంబంధించి రూపొందించిన వీడియో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్ జీవితంపై రచయిత భగీరథ రాసిన 'తారక రామం.. అన్నగారి అంతరంగం' పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులమీదుగా ఆవిష్కరించారు. తొలి ప్రతిని ముఖ్యమంత్రి చంద్ర బాబుకు అందజేశారు. పుస్తకంలో భాగస్వాములైన వారందరినీ జ్ఞాపికలతో సత్కరించారు. రచయిత సోమేశ్వరరావు రాసిన 'ఎన్టీఆర్ సినీ ప్రస్థానం' అనే మరో పుస్తకాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించి తొలి ప్రతిని 'మన దేశం' చిత్ర నిర్మాత కృష్ణవేణికి అందజేశారు. ఈ వేడుకల్లో భాగంగా సీనియర్ సంపాదకులు వి.వి.రమణమూర్తిని సీఎంచంద్రబాబు సత్కరించి అభినందించారు.