ఆధ్యాత్మిక సేవలోనే ఆత్మసంతృప్తి--- భీమిలి ఎమ్మెల్యే గంటా.
December 29, 2024
అప్పన్న అలంకరణలు అపురూపం
సింహాద్రినాదుడు అత్యంత మహిమాన్వితుడు.
.
నూతన క్యాలెండర్ ఆవిష్కరణలో భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు.
ఎంవీపీ కాలనీ, డిసెంబర్ 29--- (భీమిలి నియోజకవర్గం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను)
దేశంలోనే వరాహ,నారసింహ అవతారాల కలయిక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి ప్రత్యేకత అని అంతటి సింహాద్రి నాధుడు
అత్యంత మహిమాన్వితులని మాజీ మంత్రి, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అభివర్ణించారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు,జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో రూపొందించిన అప్పన్న అలంకరణలతో కూడిన 2025 నూతన క్యాలెండర్ ను ఆదివారం ఎంవీపీ కాలనీ లోని అయన నివాసం లో గంటా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ ఎంతో మహిమ గల సింహాద్రి నాధుడును దర్శించుకోవడం ఎంతో శుభకరము అన్నారు. ఏటా నిర్వహించే పలు ఉత్సవాల్లో అప్పన్న స్వామికి చేసే అలంకరణలు ఎంతో అపురూపమన్నారు... ఆయా అలంకరణలతో ప్రత్యేకంగా క్యాలెండర్ రూపొందించి ముద్రించడం వాటిని భక్తులు కు అందించడం అభినందనీయమన్నారు. ఈ క్యాలెండర్ భక్తులకు కనువిందు చేస్తుందని, ప్రతీ ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుందని గంటా ఆకాంక్ష వ్యక్తము చేసారు.సింహాద్రి నాధుడు అలంకరణలతో రూపకల్పన చేసిన క్యాలెండర్ ను నిషితముగా పరిశీలించిన గంటా ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబుని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళా ఆసుపత్రి అధినేత,డాక్టర్ పివి రమణమూర్తి,పుష్కర గణేష్,డాక్ యార్డ్ కేటీబి అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి, కాపు సామాజిక వర్గం నాయకులు తోట దుర్గారావు. విశ్వ తదితరులంతా పాల్గొన్నారు.