పీఎం పాలెం పేదల దేవుడు, లవన్ కేర్ మినిస్ట్రీస్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఏసు పాదం. సుమారు 250 మందికి కంటి వైద్య పరీక్షలు.
January 26, 2025
లవ్ ఎన్ కేర్ ఆధ్వర్యంలో ఉచిత ఐ క్యాంప్.
విశాఖపట్నం, : ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను. మధురవాడ ) గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం విశాఖ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో పీఎం పాలెం లో గల లవ్ ఎన్ కేర్ మినిస్ట్రీస్ ఫౌండర్ ప్రెసిడెంట్ పి.ఏసుపాదం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బేతని స్కూల్ ప్రాంగణంలో ఉచిత ఐ క్యాంప్ నిర్వహించారు. విశాఖ ఐ హాస్పిటల్ కి సంబంధించిన పదిమంది నిపుణులైన డాక్టర్ల బృందం కంటి పరీక్షలు నిర్వహించి తగిన మందులు అదే విధంగా లవన్ కేర్ మినిస్ట్రీస్ విదేశాల నుండి రప్పించిన కళ్లద్దాలను అందించారు. అలాగే ఈ క్యాంపు ద్వారా అవసరమైన వారికి శత్రచికిత్సలు విశాఖ ఐ హాస్పిటల్ ట్రస్టు ద్వారా ఉచితంగా చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మధురవాడ పరిసర ప్రాంతాల్లో కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సుమారు 250 మందిఈ అవకాశం సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో క్యాంప్ నిర్వాహకులు సాయికృష్ణ, డాక్టర్ జాహ్నవి, ఆప్తమిస్ట్లు వంశీకృష్ణ, హేమంత్ కుమార, ఆలీ, వాగ్దేవి, బేతని స్కూల్ ప్రిన్సిపాల్ సునీత, లవ్ ఎన్ కేర్ సంస్థల కరస్పాండెంట్ సునీల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.