కోడి పందాల ఆటలో పట్టుపడ్డ --- మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య.

కోడి పందాలు శిబిరాలపై దాడి. --- పట్టుపడ్డ మాజీ ఎమ్మెల్యే చింతలపూడి. ( భీమిలి నియోజకవర్గం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ ) ఆనందపురం మండలంలో రామవరం గ్రామపంచాయతీలో కోడిపందాలు ఆడుతూ మాజీ ఎమ్మెల్యే చింతలపూడి రామయ్య టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టు పడ్డారు. ఆనందపురం మండలం రామవరం గ్రామం లో నిర్మాణష్య ప్రాంతంలో కోడిపందాలు ఆడుతున్న శిబిరంపై శుక్రవారం ఉదయం టాస్క్ ఫోర్స్,ఆనందపురం పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎసిపి ఎస్ అప్పలరాజు మాట్లాడుతూ... ఈ దాడిలో గాజువాక మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నాయకులు చింతలపూడి.వెంకటరామయ్య పట్టు పడ్డారని తెలిపారు. ఈయనతో పాటు కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. వీరి వద్ద నుండి సుమారు రెండు లక్షలు నగదు, 8 పందెం కోళ్ళుతో పాటు 29 మంది వ్యక్తులను అదుపులో తీసుకున్నారు.పక్కా సమాచారం అందిన నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ సీఐ.భాస్కర్,ఆనందపురం సీఐ.సిహెచ్.వాసు నాయుడు సిబ్బంది కలిసి దాడి చేసి పట్టుకున్నారని వివరించారు. వీరుపై కేసు నమోదు చేhసి దర్యాప్తు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవ్వరు పాల్పడిన సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆనందపురం ఎస్ఐ సంతోష్, ఏఎస్ఐ పైడిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య ఈ కోడిపందాల్లో ఉన్నట్లు కూటమి నాయకులు సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారికి తెలిసిందని అందువల్ల ఈ దాడి జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.