విశాఖలో జర్నలిస్టులకు తాను స్థాపించిన స్మార్ట్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా స్థాపించినప్పటి నుండి ప్రతి పండగ రోజుల్లో జర్నలిస్టుల కుటుంబాల్లో సంతోషాన్నింపుతున్న బంగారు అశోక్ కుమార్. తన జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న ఆయన తన కెరియర్ ఇలా మారుతుంది అని ఊహించి ఉండదు. తోటి జర్నలిస్టు సంఘాలకు దీటుగా తాను స్థాపించిన సంఘాన్ని నడిపించడం అంత తేలిక కాదు. ఒక విధంగా చెప్పాలంటే విశాఖలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు అశోక్ కుమార్. జూనియర్ గా వచ్చి సీనియర్ అయ్యాడు. సీనియర్లను ఆటపట్టించాడు. ఒక విధంగా ఈయన వచ్చిన తర్వాత సంఘాలు ఎక్కువై వీరి మధ్య పోటీ తత్వం పెరిగి పండగ సందర్భాల్లో జర్నలిస్ట్ సంఘాలు తోటి జర్నలిస్టులకు వారి శక్తి మేరకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఇక ఆరోపణల అనేక రకాలుగా వస్తుంటాయి. రాళ్లు దండలు రెండు పడతాయి. అవి తట్టుకున్న వాడే నిజమైన నాయకుడు.... అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు🙏🏾🌹 జై ప్రజా బలం 🙏🏾🌹
January 12, 2025
*సమాజ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయం*
- *జీవీఎంసీ జోన్-2 ఇంచార్జ్ కమిషనర్ ఫణి రామ్*
- *ఘనంగా ఎస్సిఆర్డబ్ల్యుఏ మధురవాడ యూనిట్ సభ్యులకు డైరీలు, స్వీట్స్ పంపిణీ*
*(మధురవాడ - జనవరి 12)* సమాజ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని జీవీఎంసీ జోన్ 2 ఇన్చార్జ్ కమిషనర్ ఫణి రామ్ కొనియాడారు. మధురవాడ లోని మా మీడియా హబ్ లో ఆదివారం ఉదయం స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర -2025 డైరీ ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేనివని అన్నారు. విపత్కర సమయాల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సమాజ స్థితిగతులపై ప్రజలను చైతన్య పరుస్తున్నది జర్నలిస్టులే అని కొనియాడారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అద్వితీయమని ప్రశంసించారు. భవిష్యత్ లో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేయబోయే కార్యక్రమాలకు తమ సహకారాలు అందిస్తామని అన్నారు. అనంతరం స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ 2016వ సంవత్సరం నుండి జర్నలిస్టుల సంక్షేమమే ద్యేయంగా తమ అసోసియేషన్ కృషి చేస్తుందని అన్నారు. ఓ వైపు సమాజ సేవ చేస్తూనే మరోవైపు దాతల సహకారంతో జర్నలిస్టులకు సంక్షేమం అందిస్తూ ఎస్సిఆర్డబ్ల్యూఏ జర్నలిస్టుల ప్రశంసలను పొందుతుందని అన్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా 7 యూనిట్స్ ద్వారా జర్నలిస్టులకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.. అనంతరం సీనియర్ పాత్రికేయులు పిళ్లా విజయకుమార్, సాంబశివరావు, నాగోతి నరసింహనాయుడు, ఆనంద్ , రామునాయుడు తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా 2016 నుండి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న బంగారు అశోక్ కుమార్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.. సుమారు 400 మంది జర్నలిస్టులకు సంక్షేమం అందించడం చిన్న విషయం కాదన్నారు.. భవిష్యత్తులో అసోసియేషన్ పేరిట మరిన్ని కార్యక్రమాలు చేసి సభ్యులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.. అనంతరం జోనల్ ఇంచార్జ్ కమిషనర్ ఫణి రామ్ చేతుల మీదుగా జర్నలిస్టులకు డైరీలు స్వీట్స్ పంపిణీ చేశారు..ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ సలహాదారులు కర్రి సత్యనారాయణ, జాయింట్ సెక్రెటరీలు బాలు పాత్రో, కొండ్రి వినోద్ సీనియర్ పాత్రికేయులు విజయ్ కుమార్,
నేమాల అనేష్ కుమార్ , రాణా ప్రతాప్, కే అభిరామ్, మొజ్జాడ శ్రీను ,మానం శ్రీనివాస్, రాము, శ్రీనివాస్, బాపూజీ, , హరినాథ్, అబ్బిరెడ్డి చంద్రశేఖర్,
సురేష్ కుమార్,బాబురావు,సాయి,సత్యం,సంతోష్,కుమార్,రమణ,శంకర్ తదితరులు పాల్గొన్నారు