గంజాయి పట్టుకున్న పీ.ఎం పాలెం పోలీసులు. ముగ్గురు యువకులుఅరెస్ట్... అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు,, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు.పీ.ఎం.పాలెం సిఐ బాలకృష్ణ..
January 20, 2025
పీ.ఎం.పాలెం పిఎస్ పరిధిలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్.
1.1/2 గంజాయి, మూడు సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం.
విశాఖ నార్త్ సబ్ డివిజన్, మధురవాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను.)
పీ.ఎం.పాలెం పి.ఎస్. సి.ఐ. జి.బాలకృష్ణ ఆదేశాలతోఎస్.ఐ. కె.భాస్కరరావు తమ సిబ్బంది... మధురవాడ,కొమ్మాది రోడ్డు(రఘు వైన్స్) దరి ఏ.పీ.హెచ్.బి.కాలనీ రోడ్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా...అక్రమంగా అమ్మకానికి కలిగి ఉన్న 1.1/2 కేజీల గంజాయి వారి వద్ద స్వాధీనపరుచుకుని,కేసు నమోదుచేసి నిందితులను సోమవారం రిమాండ్ కు తరలించారు.