అన్నా క్యాంటీన్ ఆకస్మిక పరిశీలన చేసిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా. నిర్వహకులకు నాణ్యత పెంచాలని ఆదేశం.
January 22, 2025
అన్నాకేoటీన్ ఆకస్మిక తనిఖీ.... మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా.
(భీమిలి నియోజకవర్గం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
5 వ వార్డ్ మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీ లో గల అన్నక్యాంటీన్ ను మాజీ మంత్రి భీమిలి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నా క్యాంటీన్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా క్యాంటీన్లో
స్థానికులతో అందరితో కలిసి భోజనం చేశారు.
కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తూ,
ఆహారం నాణ్యత పెంచాలని, శుభ్రత పాటించాలని అన్న క్యాంటీన్ నిర్వాహకులకు సూచించారు.
అన్నా క్యాంటీన్ లో సాయంత్రం త్రాగుబోతులు, గంజాయి గాళ్ళు తో చాలా ఇబ్బందిగా ఉందని
స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా వారిపై సరైన దృష్టి సారించాలని పీఎం పాలెం పోలీసులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత మొల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.