జాతీయ జెండా ఆవిష్కరించిన కేవీపీఎస్ విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు . ఎస్ పైడితల్లి.
January 26, 2025
రాజ్యాంగ హక్కులను కాపాడు కుందం.
కే వి పి ఎస్,దళిత సంఘాల నేతలు..
( భీమిలి నియోజకవర్గం మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
కేవీపీఎస్,మధురవాడ దళిత సంఘాల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్నీ కొమ్మాది గ్రామంలో జరుపు కున్నారు.ఈ సందర్భంగా జాతీయ జెండాను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కే వి పి ఎస్)జిల్లా ఉపాధ్యక్షులు సియ్యాద్రి పైడితల్లి,ఎస్ పైడి రాజు ఆవిష్కరించారు.అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మధురవాడ దళిత సంఘాల నాయకులు సియ్యాద్రి కనకరాజు, కే వి పి ఎస్ మధురవాడ జోన్ కార్యదర్శి జి కిరణ్,నాయకులు ఎస్ పైడిరాజు పువల మాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం వక్తలు మాట్లాడుతు,మన అందరం చరిత్రను తెలుసు కోవడం చాలా అవసరం అని అన్నారు.ఇప్పుడు పరిపాలన చేస్తున్న బీజేపీ వాళ్లకు రాజ్యాంగం పైన గౌరవం,భాద్యతలు లేవని అన్నారు.రాజ్యాంగం లో అంబేద్కర్ చెప్పిన విధంగా దేశంలో సంపద అందరికీ సమానంగా ఉపయోగించాలని చెప్పారని తెలియ చేసారు. దానికి విరుద్ధంగా సంపద కేంద్రీకరణ పెరిగింగిందని అన్నారు.కొంత మంది దోపిడీ వర్గాల చేతిలో పోగు పడే విధంగా బీజేపీ నేతలు చేస్తున్నారని.అది తప్పు అని చెప్పే వాళ్ళను జైళ్లలో పెట్టి,నిర్బంధించి బయ పెట్టాలని చూస్తున్న మోడీ,అమిత్ షా లకు రాజ్యాంగం పై గౌరవం లేదని అన్నారు.అందుకే రాజ్యాంగం పైన నడుస్తున్న లోకసభలో అమిత్ షా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పై అవమాన కరంగా మాట్లాడారని అన్నారు.దీనిని ఎంత మాత్రం మనం సహించకూడదని ప్రజలను కోరారు.రాజ్యాంగ హక్కులు కాపాడు కోవలసిన భాధ్యత మన అందరి పైన ఉందని,అటువంటి కృషిని కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సి ఐ టీ యు నాయకులు డీ అప్పలరాజు,సి హెచ్ శేషు బాబు,ఎస్ గౌరీ,కే శ్రీను, విఘ్ను,తదితరులు పాల్గొన్నారు.