విశాఖలో జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.

దేశ ప్రజాస్వామ్య విలువల.వేడుక. గణతంత్ర దినోత్సవం --- మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. (విశాఖపట్నం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ - సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) విశాఖ జిల్లా - మద్దిల పాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి విశాఖ జిల్లా వైసిపి అధ్యక్షులు గుడివాడ అమర్నాద్ ఆధ్వర్యంలో వైసిపి శ్రేణులు అత్యంత వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను అమర్నాథ్ ఆవిష్కరించి అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వై,యస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలువురు జాతీయ గీతాలాపన చేయగా భారత మాతా కి జై అంటూ నినాదాలతో హారెత్తించారు. అనంతరం అమర్నాథ్ మాట్లాడుతూ భారత పౌరులు అందరికి సమాన హక్కులు కల్పిస్తూ ప్రతీ ఒక్కరి ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ రూపొందించుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భం గా యావత్తు భారతజాతి మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారని, గణతంత్ర దినోత్సవం కేవలం వేడుకలకు మాత్రమే కాకుండా మన రాజ్యాంగం లో పొందుపరిచిన విలువలను గుర్తు చేస్తుంది.గణతంత్ర దినోత్సవం కేవలం గతాన్ని వెనక్కి తిరిగి చూడటమే కాదు భవిష్యత్తు ను ఊహించి స్వాతంత్ర్యం సాదించిన నాటి నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ లలో ఒకటిగా మారడం వరుకూ భారతదేశం అద్భుతమైన పురోగతి సాధించడం జరిగిందని పేర్కొన్నారు..భారత దేశం విభిన్న సంస్కృతులు,భాషలు,మతాలు శాంతి యుతంగా సహజీవనం చేసే అపారమైన వైవిధ్యభరితమైన భూమి కనుక ఈ గణతంత్ర దినోత్సవం మనకు భిన్నత్వం లో ఏకత్వం చూపిస్తుందని,.మనకు ఇంత స్వేచ్ఛ స్వాతంత్ర్యం ని తీసుకురావడంలో తమ ప్రాణాలు అర్పించిన యోధులను గుర్తు చేసుకుంటూ మనమంతా రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ యంయల్ఏ అదిప్,ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖ జిల్లా వైసిపి పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.