జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చేంతవరకు కూటమి ప్రభుత్వంతో పోరాడుతా O---- ఫెడరేషన్ సభ్యత్వ నమోదు లో మాట్లాడుతున్న జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు.

జర్నలిస్టుల సంక్షేమమే ఫెడరేషన్ లక్ష్యం కూటమి ప్రభుత్వానికి దశల వారీగా వినతులు అర్హులైన వారికి ఇళ్లస్థలాలు కేటాయించాల్సిందే వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు. విశాఖపట్నం,కలెక్టరేట్, జనవరి 20,,-- ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ.. రాష్ర్టంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపి స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ లు పనిచేస్తున్నాయని జాతీయ జర్నలిస్టుల సంఘం (ఎన్ ఏ జె) కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు.విశాఖ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఏపి ఎన్ జి వో హోమ్ లో సోమవారం వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రాష్ర్టంలో అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు, అక్రిడేషన్లు సదుపాయం కల్పించాలని అలాగే ప్రమాధ భీమా పథకాన్ని తిరిగి పునరుద్దరించాలని కూటమి నాయకులకు దశల వారీగా తమ రాష్ట్ర, జాతీయ యూనియన్ లు వినతిపత్రాలు అందజేశాయన్నారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేష్ లకు ఆయా అంశాలకు సంబంధించి తాను కూడా వినతిపత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఆయా సమస్యలను కూటమి ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తుందని ఎదురు చూస్తున్నామన్నారు.విశాఖ అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి.నారాయణ్, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావులు మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం నియమించిన అన్ని కమిటీల్లోనూ ప్రభుత్వం పాత్రికేయులకు ప్రాతినిద్యం కల్పించాలన్నారు. అలాగే ఉమ్మడి విశాఖలో గత ఏడాది తమ యూనియన్ లలో సుమారు 800 మంది జర్నలిస్ట్ లు సభ్యులుగా చేరినట్లు చెప్పారు. ఈ సారికూడా తొలుత విశాఖ అర్బన్ యూనిట్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించామని , త్వరలోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. నిరంతరం జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు పాటుపడుతున్నామన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పది రోజుల పాటు కొనసాగుతుందన్నారు. కావున వర్కింగ్ జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీరు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపి బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ నగర అధ్యక్ష, కార్యదర్శి ఇరోతి ఈశ్వరరావు, కె.మధన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగన్ మోహన్, కె.శ్రీనివాసరావుతో ఉపాధ్యక్షులు వై. రామకృష్ణ,టి.కృష్ణమూర్తినాయుడు ఇతర కార్యవర్గ సభ్యులు కె వి శర్మ, రవి శంకర్, చక్రి,, ఎంవీ రాజశేఖర్,బి ఏ నాయుడు,కె. సత్య నారాయణ,బొబ్బర ప్రసాద్,వై..రాజ శేఖర్, శ్రీ లత, కిషోర్, జగన్నాధం,తదితరులంతా పాల్గొన్నారు.