వాసవి మాత మహాశాంతి యాగం. భారీ సంఖ్యలో మహిళలు ప్రత్యేక పూజలు
February 01, 2025
విశాఖపట్నం సిటీ. ఎంవిపి కాలనీ.
(మధురవాడ ప్రజాబలం న్యూస్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను)
ఓం శ్రీ సాయిరాం.. జై వాసవి శుక్రవారం శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా స్థానిక
శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ సభ్యులు అమ్మవారికి స్వ హస్తాలతో క్షీరాభిషేకం గావించి తదనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దర్శనము గావించుకుని తీర్థ ప్రసాదములు తీసుకొని తదనంతరం పాండురంగ స్వామి వారి దేవాలయంలో జిల్లా వాసవి క్లబ్బుల నిర్వహణలో 250 మంది మహిళలు చే జరుగుచున్న శ్రీ వాసవి మాత మహా శాంతి యాగం (హోమం) కార్యక్రమం సందర్శించుట జరిగినది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు
Vn వెంకట రామకృష్ణారావు, కోశాధికారి Vn P C గుప్త, Vn K. శ్రీనివాసరావు, Vn మల్లేశ్వర గుప్తా,Vn వాసుదేవ మూర్తి,Vn జీ నరసింగరావు,Vn P. హరగోపాల్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.