రక్త దానమే ప్రాణదానం రోటరీ బ్లడ్ బ్యాంక్. చైర్మన్ ఎస్ రాజు

ఒకరి రక్తదానంతో ముగ్గురు ప్రాణాలు కాపాడొచ్చు రోటరీ బ్లడ్ బ్యాక్ ఛైర్మన్ జిఎస్ రాజు (విశాఖపట్టణం ప్రజా బలం న్యూస్ ఆన్లైన్)( ఎక్స్ ప్రజాశక్తి తిరుపతిరావు ఎడిటర్) (
సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) ఒకరు దానం చేసిన రక్తంతో ముగ్గురు రోగుల ప్రాణాలను కాపాడొచ్చని రోటరీ బ్లడ్ బ్యాక్ ఛైర్మన్ జిఎస్ రాజు తెలిపారు. రక్తాన్ని ప్లాస్మా, ప్లేట్లెట్స్, రక్తకణాలుగా విభజించి వాటిని అవసరమైన రోగులకు అందజేస్తామన్నారు. నగరంలోని ఓ ప్రయివేటు హోటల్లో నిర్వహించిన జెసిఐ వైజాగ్ పోర్ట్ ఎమిగోస్ ఎనిమిదో ఇనిస్టలేషన్ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. నగరంలో నెగిటివ్ బ్లడ్ గ్రూపులు కొరత అధికంగా ఉండడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కువ మంది రక్తదానం చేసి రక్తకొరత తీర్చేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో రోటరీక్లబ్ నిర్వహించిన సాహసోపేతమైన అత్యవసర సేవలను వివరించారు. తమ సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలందించామన్నారు. కోవిడ్ సమయంలో మిగతా రోగులతో పాటు 10 డాక్టర్లు, ఇద్దరు రాష్ర్టమంత్రులకు అత్యవసర సమయాల్లో ప్లాస్మా అందించి వారి ప్రాణాలు నిలిపినట్టు తెలిపారు. అనంతరం కీ నోట్ స్పీకర్, ఆర్గనైజేషన్ జోన్ 4 మెంటర్ కెవి రావు మాట్లాడుతూ జెసిఐ ఆఫీసర్లు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. మరింత ఉత్సాహంగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను తనదైన శైలిలో వివరించారు. అనంతరం జెసిఐ వైజాగ్ పోర్ట్ ఎమిగోస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ఏడాది నిర్వహించనున్న కార్యక్రమాల ఫ్లయర్లను వేదిక మీద ఉన్న అతిథులు జెసిఐ జోన్ ప్రెసిడెంట్ సంతోష్, జెసిఐ సెనెటర్ మాధురి సామినేని, ఐపిపి భార్గవ్ మహర్షి, లామ్ వ్యవస్థాపకులు ఛంద్రమౌళి ఆవిష్కరించారు. సమాజంలో ఎంతో విలువైన సేవలందిస్తున్న 100 సేవకులను గుర్తించి సెల్యూట్ ది సైలెంట్ స్టార్స్ పేరుతో వారిని సన్మానించాలని, నగరంలోని ఓ బాలికల ప్రభుత్వ హాస్టల్లో ఐదు టాయిలెట్ల నిర్మిస్తామని, 200 మంది అనాధ బాల బాలికలను సినిమాకు తీసుకెళ్తమని, ఇంటర్ స్కూల్ కాంపిటేషన్స్ నిర్వహిస్తామని, వంద యూనిట్లు రక్తదానం చేస్తామని, నగరంలోని అన్నార్తులకు ఒక రోజు ఆహారం అందజేయడం తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది. నూతన నాయకత్వం ఏర్పాటు అంతకు ముందు ఉన్న లామ్ నాయకత్వం పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త ప్రసెండెంట్ గా జెసి హెచ్.జి.ఎఫ్ రాజగోపాల్, సెక్రటరీగా జెసి తిరుపతిరావు, ట్రెజరర్ గా జెసి రంగనాధ్ నియమితులయ్యారు. వీరి నాయకత్వంలో 21 మంది బాల బాలికలతో జూనియర్ జెసిఐ వింగ్ ఏర్పాటు చేశారు. వివిధ లామ్ ల నుంచి సుమారు 70 మంది వరకూ జెసిఐ ఆఫీసర్ల హాజరయ్యారు.