రైల్వే స్కూల్ విద్యార్థులకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సహాయ సహకారం.
February 02, 2025
రైల్వే స్కూల్ విద్యార్థులకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పెన్నలు,
పుస్తకాలు వితరణ. బాత్రూమ్ తయారీకి 50,000 సహాయం.
- విశాఖపట్నం --ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
వాసవీ క్లబ్ ఎం.వి.పి.కపుల్స్ ఆధ్వర్యంలో
తేదీ 02-02-2025 , ఆదివారం
శ్రీ పంచమి వసంత పంచమి సందర్భంగా
గవర్నర్ తమ్మన అమర్నాథ్ సమక్షంలో రైల్వే స్టేషన్ దగ్గరలో వున్న రైల్వే హైస్కూల్ లో చదువులతల్లి సరస్వతి దేవి పూజ ,తదుపరి విద్యార్థులకు సుమారు 60 మంది విద్యార్థులకు నోట్ పుస్తకములు,పెన్నులు,
మిఠాయిలు, స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు వాసవి క్లబ్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయి నిర్మల. జిల్లా కోశాధికారి చెరుకు కృష్ణఅంతర్జాతీయ ఉపాధ్యక్షుడు మధుసూదన్. నవ నిర్మాణ కోచ్ డి.వి.ఎస్.రామారావు IPC వాసుదేవమూర్తి వాసవి క్లబ్ ఎం వివి కపుల్స్ అధ్యక్షుడు రామకృష్ణారావు ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు కార్యదర్శి వెంకటరమణ మూర్తి కోశాధికారి చంద్ర శేఖర్ గుప్తా నాగవేణి నూకరత్నం హరగోపాల్,గ్రంధి కృష్ణారావు,బద్రి,ఉషశ్రీ మున్నగు వారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి విద్యార్థులకు వస్తు రూపేణా విరాళములు ఇచ్చిన వారు...వాసవియన్స్....కాపుగంటి శ్రీనివాసరావు కాపుగంటి వెంకట రమణ మూర్తి పల్లపోతు హరగోపాల్ చెరుకు కృష్ణ
పి.డి .శ్రీ ప్రసన్నకుమార్, వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ కు చేస్తున్న సేవలను గురించి కొనియాడారు.
చివరిగా...ఆ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రసన్న కుమార్ కోరిక మేరకు టాయిలెట్స్ నిర్మాణానికి వెంటనే స్పందించి రూపాయలు 50,000/- గవర్నర్ అమర్నాథ్ కి, వాసివియన్ బద్రి నారాయణ కి క్లబ్ సభ్యులు అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.