స్మార్ట్ సిటీ వెల్ఫేర్ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు. పలువురు జర్నలిస్టులకు సన్మానం. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ తో పాటు, నిరుపేద జర్నలిస్టులకు 50 గజాలు ఇంటి స్థలం. హామీ ఇచ్చిన కంచర్ల.. అందర్నీ ఆలోచింప చేస్తున్న కంచర్ల ప్రకటన.
March 27, 2025
రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్లు
- నిరుపేద జర్నలిస్టులకు 50గజాల ఇంటి స్థలం
ఎస్.సీ.ఆర్ డబ్ల్యూ.ఏ ఉగాది సంబురాల్లో డా. కంచర్ల సంచలన ప్రకటన.
(విశాఖపట్నం - మార్చి 27) ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను, మధురవాడ.) విశాఖలోని మీడియాలో పనిచేసి 60ఏళ్లు నిండిన రిటైర్డ్ జర్నలిస్టులకు రూ.4వేలు పెన్షన్.. నిరుపేద వర్కింగ్ జర్నలిస్టులకు తమ రియలెస్టెట్ సంస్థ వేసే వెంచర్లలో ప్రతీ ఉగాదికి 10 మందికి 50గాజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డా.కంచర్ల అచ్యుతరావు సంచలన ప్రకటన చేశారు. గురువారం ఎస్.సీ.ఆర్. డబ్ల్యూ.ఏ ఉగాది సంబురాల్లో డా. కంచర్ల అచ్యుతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో ఆయన ప్రశంగించారు. సమాజంలో ఏ విషయమైనా బయటకు తెలియాలంటే ఒక్క జర్నలిస్టు వలన మాత్రమే అధి సాధ్యపడుతుందన్నారు. జర్నలిస్టులు లేని సమాజం ఊహకు కూడా అందదన్నారు. ఎక్కడైతే ఒక వర్కింగ్ జర్నలిస్టు పూర్తిస్థాయిలో పనిచేస్తాడో అక్కడ సమస్త సమాచారం ప్రజలకు తెలుస్తుందన్నారు. జర్నలిస్టుగా సుదీర్ఘ కాలం పనిచేసి 60ఏళ్లు దాటిన రిటైర్డ్ జర్నలిస్టులకు ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పించాలని.. నేటి వరకూ ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదాన్నారు. అటాంటి రిటైర్డ్ జర్నలిస్టులకు ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్పేర్ అసోసియేషన్ నుంచి నెలకు రూ.4వేలు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఏ జర్నలిస్టుకైనా అవసరం ఉన్న సమయంలోనే మనం సహాయ పడితే అది వారికి ఉపయోగపడుతుందన్నారు. జర్నలిస్టులంటే నాకు అత్యంత గౌరవం, ఇష్టమని.. జర్నలిస్టుకి చేసే సహాయం సమాజానికి చేసినట్టుగానే తాను భావిస్తానన్నారు. అదేవిధంగా జర్నలిస్టులంతరికీ ఆరోగ్యపరంగా కావాల్సిన హెల్త్అండ్ ఇన్స్యూరెన్స్ కూడా తాను చేయించానికి ముందుకి వచ్చినట్టు చెప్పారు. జర్నలిస్టులకి కష్టం అంటే సహాయం చేయడానికి సాటి జర్నలిస్టు ముందుకి రావాలని పిలుపునిచ్చారు. ఎస్.సీ.ఆర్ డబ్ల్యూ.ఏ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ అసోసియేషన్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారు. త్వరలోనే అసోసియేషన్ కు సొంత ప్రెస్ క్లబ్ భవనం పూర్తవుతుందన్నారు. రానున్నరోజుల్లో కూడా రాజీలేకుండా జర్నలిస్టులకు సంక్షేమం అందిస్తామన్నారు. అదే విధంగా అడిగిన వెంటనే కాదనకుండా.. లేదనకుండా ఉగాది సంబురాలకు ఇతోదికంగా సహాయం అందించిన డా.కంచర్ల సేవా నిరతిని కొనియారు. అనంతరం ఎస్ఈఆర్ డబ్ల్యూఏ అధ్యక్షుడు, కార్యవర్గం డా.కంచర్ల అచ్యుతరావును భారీ పూలమాలలు, పూల వర్షం, జర్నలిస్టుల కరతాళ ధనుల మధ్య ఘనంగా సన్మానించి సత్కరించారు.. ఈ సందర్బంగా పలువురు జర్నలిస్టులను డా.కంచర్ల ఘనంగా సత్కారించారు. చివరిగా జర్నలిస్టులకు ఉగాది కిట్లను డా.కంచర్ల వితరణ చేశారు. ఉగాది సంబురాల్లో కూచిపూడి నృత్యకారిని అపర్ణ చేసిన నృత్యాలు, డా.కంచర్ల అచ్యుతరావు పై స్పెషల్ మ్యూజికల్ సాంగ్, ఎస్.సీ.ఆర్ డబ్ల్యూ.ఏ ఆవిర్భావం నుంచి చేస్తున్న కార్యక్రమాలపైనా ప్రత్యేకంగా తయారు చేసి ఏవీ విశేషంగా కట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు బిఎస్ చంద్రశేఖర్, కర్రీ సత్యనారాయణ,
ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ అప్పారావు, ఉపాధ్యక్షులు ఎస్ ఎన్ నాయుడు,కోశాధికారి అశోక్ రెడ్డి కార్యవర్గ సభ్యులతో పాటు గాజువాక పెందుర్తి మధురవాడ భీమిలి ఆరిలోవ సాగర్ నగర్ యూనిట్ల ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు