భీమిలి ఎమ్మెల్యే గంటా సహకారంతో 7వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తాం, 45 లక్షల రూపాయలు జీవీఎంసీ నిధులతో మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ మంగమ్మ,వెంకటరావు
March 22, 2025
మధురవాడ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) 7.వ వార్డలో ఎన్జీవో కాలనీ నుఁడి భరత్ నగర్ కనెక్టింగ్ రోడ్డు సుమారు 45 లక్షల నిధులతో చేపట్టబోతున్న రోడ్లు, పనులకు శనివారం కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, పిల్లా వెంకటరావు, శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పిల్లా మంగమ్మ మాట్లాడుతూ . కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వనారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు చొరవతో వార్డులో పలు అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని ఇంకా వార్డులో చాలాచోట్ల రోడ్లు కాలువలు నిర్మించాల్సి ఉందని దశలవారీగా అన్ని పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కార్పొరేటర్ మంగమ్మ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 7 అవార్డు టిడిపి
అధ్యక్షులు పిల్లా నరసింగరావు సెక్రటరీ కానూరి అచ్యుతరావు, సీనియర్ టిడిపి నేత పోతిన నాయుడు రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి దుర్గారావు పార్లమెంట్ రి కార్యదర్శి నాగోతి సూర్యప్రకాష్ రాష్ట్ర టి ఎన్ టి యు సి
ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ బిసి సెల్ అధ్యక్షులు పోతిన బుజ్జి, పోతిన బాలాజీ మలువలస రాము పిల్లా శివకృష్ణ టిడిపీ శెంకర్ కోటేశ్వరరావు రాజు అచ్చిబాబు కిషోర్ దాసరి కాంతం , గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.