మిథిలాపురి కాలనీ 8వ వార్డ్ వికలాంగులకాలనీలో నకిలీ పట్టాలపై చర్యలు తీసుకొని నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలి. జోన్ 2 కమిషనర్ కనకమహాలక్ష్మికి వినతి పత్రం అందించిన విశాఖ సిపిఐ జిల్లా కార్యదర్శి మరిపిల్లి పైడిరాజు .

మిథిలాపురి 8వ వార్డు దివ్యాంగుల కాలనీ లో దొంగ పట్టాలు ముఠాను అరికట్టి నిజమైన దివ్యాంగులకు న్యాయం చెయ్యాలి - సిపిఐ !. విశాఖ జిల్లా కార్యదర్శి. ఎం పైడిరాజు డిమాండ్. గ్రీవెన్స్ లో జోన్ టు కమిషనర్ కనకమహాలక్ష్మికి వినతి పత్రం. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు మాట్లాడుతూ మధురవాడ దివ్యాంగుల కాలనీ నకిలీ పట్టాలు వ్యవహారం పై సమగ్ర విచారణ చేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చెయ్యాలని కోరారు. విశాఖపట్నం రూరల్ మండలం, మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మధురవాడ జోన్ మిదిలాపురి వుడా కాలనీ నుండి ఐటి హిల్స్ కు వెళ్లే మార్గంలో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా 136 మంది దివ్యాంగులకు 96 చ "గ"లు చొప్పున ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసిందదని ఈ స్థలాలలో దూర భారంగా ఉన్న దివ్యాంగులు ఇళ్ళు నిర్మించుకోవడం ఆలస్యం అవడంతో ఒక మూఠా ఈ కాలనీ లోని కాళీ స్థలాలను నకిలీ పట్టాలు సృష్టించి అమ్మకాలు జరుపుతూ ఇళ్ళు నిర్మించుకోవడానికి వచ్చిన నిజమైన లబ్ధిదారులైన వారిని బెదిరించి, భయపెట్టి వారిని చిత్రహింసలకు గురించేస్తున్నారన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి దొంగ పట్టాలు సృష్టించి అమ్ముతున్న నకిలీ ముఠా దందాలను అరికట్టి నిజమైన దివ్యాంగులకు రక్షణ కల్పించి న్యాయం చెయ్యాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరుపున కోరారు. ఈ కార్యక్రమలో సిపిఐ మధురవాడ ఏరియా కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ, ఎం ఎస్ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు.