ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షులు రామకృష్ణ. ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు

విశాఖ సిటీ,(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) ఓం శ్రీ సాయిరాం... జై వాసవి... ఎంవిపి కపుల్స్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో తేది 30-03-2025 న ఆదివారం సాయంత్రం గం.5.30 ని.లకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా ఎం.వి. పి.కాలనీ, సెక్టార్ -1 లో అమ్మా హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీ షిరిడీ సాయి బాబా గుడిలో , శ్రీ ప్రభాకర శాస్త్రి గారిచే పంచాంగ శ్రవణం నిర్వహించబడినది. తదనంతరం ప్రభాకర్ శాస్త్రి కి సాలువతో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకట రామకృష్ణారావు, కార్యదర్శి వాసవియన్ కే వెంకటరమణమూర్తి, కోశాధికారి వాసవియన్ పి చంద్రశేఖర్ గుప్తా, చార్టర్ ప్రెసిడెంట్ వాసవియన్ చెరుకు కృష్ణ గారు, కార్యక్రమాల అధ్యక్షుడు వాసవియన్ పి శివరామకృష్ణ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు