విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు,, స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలి. ప్రజా సంఘాల పిలుపు.
March 29, 2025
స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవాలి.ప్రజా సంఘాలు.
(మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించీ,ఉక్కు పరిశ్రమ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల స్ఫూర్తితో విశాఖ ఉక్కు ను రక్షించుకోవాలని మధురవాడ ప్రజా సంఘాల నాయకులు కోరారు.శనివారం సి ఐ టీ యు, ఏ ఐ టీ యు సి,ఐద్వా నాయకులు మధురవాడ మార్కెట్,దుఃఖానాలు,బస్సు స్థాపు తదితర ప్రాంతాల లో నినాదాలు చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు ప్యాకేజీ ఇస్తున్నామని ప్రకటించి,ప్లాంట్ అవసరాలకు,కార్మికుల జీతభాత్యాల సమస్య పరిష్కారం కోసం కాకుండా అప్పులు తీర్చడానికి అని ఇప్పుడు ప్రకటించిందని అన్నారు.అది కూడా సగం మాత్రమే విడుదల చేసిందని అన్నారు.ప్రభుత్వ పరిశ్రమ అయినా విశాఖ ఉక్కుకు ఘనులు ఇవ్వకుండా,ఇంకా పరిశ్రమ పెట్టని ప్రైవేట్ కంపెనీకి ఘనులు కేటాయించమని మన సి ఎం చంద్రబాబు అడగడం అంటే మనల్ని మోసం చేయడమేనని అన్నారు.ఘనులు మనవి,విశాఖ ఉక్కు కర్మాగారం మనది, దానిని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నుండి కాపాడు కోవాలసిన భాధ్యత కూడా మనదే అని కోరారు.విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ గాంధీ విగ్రహం వద్ద దీక్షలు చేపట్టి ఏప్రల్ 1 కి నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతుందని,ఈ అందర్భంగా ఆర్ టీ సి కాంప్లెక్స్ వద్ద జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పీ రాజు కుమార్,వి సత్యనారాయణ,డీ అప్పలరాజు,డీ కొండమ్మ,బి భారతి, ఎం బంగారయ్య,కే రాము తదితరులు పాల్గొన్నారు.