ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టినవిశాఖపట్నం సిటీ,జీవీఎంసీ ఆరో వార్డుకు చెందిన దాసరి శ్రీనివాసరావు.
March 19, 2025
విశాఖపట్నం (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
రాష్ట్ర చేనేత కుల కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా పీఎం పాలెం కి చెందిన దాసరి శ్రీనివాసరావు మంగళవారం 18/3/2025 విజయవాడ గొల్లపూడి బీసీ కార్పొరేషన్ భవనం లోకార్పొరేషన్ చైర్మన్ శ్రీ అబద్ధం మేనేజింగ్ డైరెక్టర్, ఇతర అధికారులు స్టేట్ బోర్డు డైరెక్టర్స్ అందరి సమక్షంలో పూర్తి బాధ్యతలు స్వీకరించారు.అనంతరం జరిగిన ప్రధమ సమావేశంలో చైర్మన్ అధికారులు తో సమావేశంలో పాల్గొన్నారు. తనకి ఇంత మంచిచక్కటి అవకాశం కలిగించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి, యువనేత లోకేష్ బాబు కి ప్రియతమ మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీసీ కులాల అభివృద్ధికి,చేనేత కళాకారులకు, పద్మశాలి సామాజిక తరగతి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు..