ఒకటిన్నర కిలోల గంజాయి పట్టివేత., మధురవాడ స్వతంత్ర నగర్ లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్న పీఎం పాలెం సిఐ బాలకృష్ణ...... చంద్రంపాలెం పై కూడా పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఎంతో మంచిగా ఉండే యువత పాడైపోతున్నారని స్థానికులుచెప్పుకుంటున్నారు..

మధురవాడ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) పీఎం పాలెం పోలీసు లకు గంజాయి కి సంబదించిన సమాచారం అందడంతో , పోలీసు సిబ్బంది స్వతంత్ర నగర్ ఏరియాలో సచివాలయం దగ్గర లో మధురవాడ స్వతంత్ర నగర్ కి చెందిన కరకాని గణేష్, తొంపల సాయికుమార్, బానన రామదాసు, నిడదలోవు రాము, లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1 1/2 కిలోల గంజాయి ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి ముద్దాయి లని శుక్రవారం రిమాండ్ కి తరలించారు. సిఐ బాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.