అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జీవీఎంసీ ఐదవ వార్డు కార్పొరేటర్ ఎం.హేమలత.
March 19, 2025
ఐదవ వార్డ్ లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ.
కార్పొరేటర్ మొల్లి హేమలత
భీమిలి నియోజకవర్గం,మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :: ఐదవ వార్డ్ పరిధి మారికవలస లో సుమారు 12 లక్షల నిధులతో చేపట్టబోతున్న రోడ్లు,కాలువలు పనులకు బుధవారం అవార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ మారికవలస లో ఇప్పటికే 20 లక్షల నిధులతో రోడ్లు కాలువలు నిర్మించడం జరిగిందని, ఇంకా మిగిలి ఉన్న ప్రాంతాల్లో కూడా రోడ్లు కాలువలు అంచలంచలుగా అభివృద్ధి చేస్తామన్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు సహకారం తో వార్డులో చాలా అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని,కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వార్డ్ లో సుమారు 13 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలు పెట్టామని,ఇంకా వార్డులో చాలాచోట్ల రోడ్లు కాలువలు మెట్ల మార్గాలు నిర్మించాల్సి ఉందని దశలవారీగా అన్ని పనులు పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కార్పొరేటర్ మొల్లి హేమలత కు ధన్యవాదాలు తెలియజేస్తూ చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,మాజీ కార్పొరేటర్ మాన్యాల సోంబాబు, ముచ్చి రామనాయుడు, జనసేన నాయకులు దేవర శివ, మిత్తాన రమణమ్మ ,రాజు,చంటి, సూరిబాబు రెడ్డి, గ్రామ పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.