ఆన్లైన్ బెట్టింగ్స్ తో యువత బేజారు.. పొలిటికల్ ట్రబుల్ షూటర్ టిడిపి స్వామి

మధురవాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు నాయకులు కార్యకర్తలు తన మన అనే ఆలోచన ప్రక్కన పెట్టి ప్రతీ ఒక్కరు జాగరుకతతో ఉండాలి ఇటువంటి యాప్స్ వలన బానిసలు అవుతున్నా భాధితులలో అధికశాతం యువతే.ప్రపంచ దేశాలతో పోలిస్తే యువతే మనదేశానికి బలం మరియు బలగం. వీటి వలన దేశ ఆర్ధిక వ్యవస్థకు ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువుగా ఉంది. ముఖ్యంగా సమాజ స్థిరత్వానికి ,వ్యక్తిత్వ మనోవికసానికి అడ్డంకిగా ఉండి చిన్న ,మధ్యతరగతి కుటుంబాలలో అంతర్గతంగా కలహాలకు కారణం అవుతున్నాయి ఇటువంటి ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కి ప్రభావ వంతమైన ప్రచారం కోసం సెలబ్రిటీలను ఉపయోగించి యువతను ఆకర్షించి తప్పు తోవ పట్టించే అవకాశం ఉన్నది కనుక సామాజికంగా అందరు కలిసి ఇటువంటి సమస్యలపై అవగాహన యువతలో తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉన్నది అని అభిప్రాయం వ్యక్తం చేసారు పొలిటికల్ ట్రబుల్ షూటర్ టి డి పి స్వామి .