చంద్రంపాలెం జాతర గట్టు దుర్గమ్మ ఆలయంలో కొత్త అమావాస్య పురస్కరించుకొని ఆరామ ద్రావిడ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం.

చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో పంచాంగ శ్రవణం! (విశాఖ సిటీ మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దేవాలయంలో క్రొత్త అమావాస్య పురస్కరించుకొని శ్రీమాతా ఆరామ ద్రావిడ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు, ముందుగా వినాయక పూజతో ప్రారంభమై సత్యవర అగ్రహారం సౌభాగ్య జ్యోతిష్య ఆలయం వారి జోస్యుల సంజీవ శర్మ గారి పంచాంగం శ్రీ రేజేటి నర్సింహమూర్తి, భాస్కరభట్ల సత్య ప్రసాద్ శర్మ గార్లచే పంచాంగం శ్రవణం కార్యక్రమం నిర్వహించారు, అనంతరం తీర్ధ ప్రసాదాలు భక్తులకు అందజేశారు, అనంతరం సభ్యులందరికీ పంచాంగ ప్రతులు అందజేశారు, ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు వేమకోటి అనంత పద్మనాభ శర్మ, సభ్యులు వేమకోటి సుబ్బలక్ష్మి నరసింహ శర్మ, జోస్యుల శివప్రసాద్ శర్మ, శ్రీ దుర్గాలమ్మ ఆలయ ప్రధానార్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, శ్రీమాతా ఆరామ ద్రావిడ సంఘ సభ్యులు శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు సెక్రటరీ నాగోతి తాతారావు తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం చేసిన పురోహితులకు ఆలయ కమిటీ దుశ్శాలువతో సత్కరించారు.