వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ వారి ఆధ్వర్యంలో పలువురు మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు

జై వాసవి...వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో సమతా కాలేజీ విద్యార్థులకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి సరస్వతి పథకం క్రింద ఐదుగురు మెరిట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు స్కాలర్ షిప్ ఇవ్వడం జరిగింది. ఈ స్కాలర్షిప్లు స్థానిక ఎం.వి.పి కాలనీ ఆళ్వార్ దాస్ గ్రౌండ్ లో ఉత్సాహబరితంగా నిర్వహించిన సమత కళాశాల వార్షికోత్సవ వేడుకలలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమతా కాలేజీ డైరెక్టర్ శ్రీనివాస రావు గారు మరియు క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకట రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వాసవియన్ కె. వెంకటరమణమూర్తి గారు, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ గారు, వాసవియన్స్ పాలూరి శివరామకృష్ణ, పి.హర గోపాల్, గ్రంధి కృష్ణారావు గారు పాల్గొన్నారు. కళాశాల డీన్ & కరస్పాండెంట్ ప్రొఫెసర్ ఎస్. విజయ రవీంద్ర గారు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అల్వార్ దాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ డాక్టర్ ఎస్ .పి .రవీంద్ర గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయి చేరేలా తమ అడుగులు ఉండాలని ఆకాంక్షించారు.