ఐదవ వార్డ్ లో పలు సమస్యలపై జీవీఎంసీ కమిషనర్ కు వినత పత్రం అందజేసిన కార్పొరేటర్ హేమలత.

వార్డ్ సమస్యల పై ఇన్చార్జి జీవీఎంసీ కమిషనర్ అయిన కలెక్టర్ హరిందర్ ప్రసాద్ కు వినతి. త్రాగునీరు,యు జి డి, వీధి దీపాలు సమస్య ను సత్వరమే పరిష్కరించాలి. _5 వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత. విశాఖపట్నం.. (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) జీవీఎంసీ 5 వ వార్డ్ సమస్యల పై ఆ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత శనివారం ఇంచార్జ్ కమిషనర్ కలెక్టర్ హరేందర్ ప్రసాద్ కు వినాతి పత్రం అందజేశారు. ముఖ్యంగా వార్డులో యూజీడి,త్రాగునీరు, వీధిదీపాల సమస్య ఎక్కువగా ఉన్నదని, వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధులతో సాయిరాం కాలనీలో నిర్మిస్తున్నటువంటి త్రాగునీటి స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని,పరదేశిపాలెం, బోరవానిపాలెం,కొత్తపాలెం, సాయిరాం కాలనీలలో గల స్మశాన వాటికల అభివృద్ధి పనులు చేపట్టాలని,వార్డ్ లో గల బొట్టవాని పాలెం,నగరం పాలెం చెరువులను అభివృద్ధి చేయాలని జీవీఎంసీ కౌన్సిల్లో కలెక్టర్ హరేందర్ ప్రసాద్ కు వివరించి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. సానుకూలంగా స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి తొందర్లోనే చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారని ఆమె అన్నారు.