ఈ పంచముఖ
March 18, 2025
శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు
భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
మధురవాడ :--చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడుగా ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఫాల్గుణ మాసం బహుళ పక్షం చవితి మంగళవారం సందర్భంగా నిత్య అర్చనలతో ప్రారంభించి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి అనంతరం పూల మాలలు, తమల ఆకుల మాలలు తదితర సామాగ్రితో అలంకరణ, అనంతరం నాగవల్లి ధళార్చన, సింధూరార్చన తదితర పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, హరి చరణ్ తదితరులు జరిపించి, నీరాజన మంత్రపుష్పం స్వామి వారికి సమర్పించి, భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు,
ఈ పూజా కార్యక్రమంలో శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, కమిటీ సభ్యులు
పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, పిళ్లా రమణ, పొట్నూరి హరికృష్ణ, గ్రామ పెద్దలు పిళ్లా సత్యన్నారాయణ,
ముఖ్య సభ్యులు యస్.శ్రీను, దుక్క అప్పారావు, పి.రమేష్, పి.రాంబాబు, అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాలలో
పాల్గొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారితో పాటు ఆలయంలో ఉన్న వినాయకుని, శ్రీ దుర్గాలమ్మ అమ్మవారిని, శ్రీ షిర్డీ సాయినాధుని కూడా దర్శించుకోవడం జరిగింది.....🌹🙏🏾 ప్రతి మంగళవారం రామ భజన దుర్గమ్మ ఆలయంలో కొనసాగుతోంది.