ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి.
March 17, 2025
విశాఖపట్నం (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
ఓం శ్రీ సాయిరాం...జై వాసవి. 16.03.2025 పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఎం.వి.పి.కపుల్స్ సభ్యులు ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అంతర్జాతీయ వాసవి క్లబ్స్ ఉపాధ్యక్షుడు వాసవియన్ వేద మధుసూదన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీరాములు ప్రత్యేక తెలుగు రాష్ట్రానికై చేసిన ప్రాణ త్యాగం గురించి వివరిస్తూ మన వాసవి క్లబ్స్ చేస్తున్న సామాజిక, సాంఘిక సేవా కార్యక్రమాల గురించి విపులంగా తెలియచేసారు. వాసవి క్లబ్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.