జాతర గట్టు చంద్రం పాలెం దర్గాలమ్మ ఆలయంలో ఘనంగా ఉగాది సంబరాలు.
March 30, 2025
చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు, అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు!
విశాఖ సిటీ, (మధురవాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను)
చంద్రంపాలెం జాతర గట్టుపై కొలువై ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ, శ్రీ షిర్డీ సాయినాధ సహిత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది మహోత్సవాలు ఘనంగా జరిగాయి,
శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి వేకువజామున సుప్రభాత సేవతో ప్రారంబించి, పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అమ్మవారిని, అలంకరించి పంచాంగ పఠనం చేసి కుంకుమార్చనలు, పుష్పార్చనలు నీరాజన మంత్ర పుష్పం తదితర కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ మూర్తి శర్మ తదితరులు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనాలు జరిపించారు, భక్తులకు షడ్రుచుల ఉగాది పచ్చడి, ఈ సంవత్సరంలో అందరికీ శుభం జరగాలని భక్తుల సహాయ సహకారాలతో తీపి బూంది ప్రసాదం భక్తులందరికీ పంపిణీ చేయడం జరిగింది, సాయంత్రం వేళలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపారాధన సేవా కార్యక్రమాలు నిర్వహించారు, అదే విధంగా మానం వెంకటరావు ఆధ్వర్యంలో భక్తి గీతాలతో కూడిన భజన కార్యక్రమం, ఇలిపిల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో చంద్రంపాలెం మహిళల కోలాట బృందం వారిచే కోలాటం ప్రదర్శించడం జరిగింది, అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు,
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పి.వి.జి.అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు ఉప కోశాధికారి దుక్క వరం, జాయింట్ సెక్రటరీ పిళ్లా మోహన్ శివకృష్ణ, కమిటీ సభ్యులు పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, పోతిన శివ,బోగవిల్లి రాము, పిళ్లా రమణ, పొట్నూరి హరికృష్ణ, పిళ్లా రాజు, యమ్.ఆనంద్, బంక వాసు, యస్.ఆర్.బాబు,
చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్లా శ్రీనివాసరావు, పీస రామారావు, పి.సత్యన్నారాయణ, జగుపిల్లి నాని, బి. సత్యన్నారాయణ, కోన అరవింద్,
ముఖ్య సభ్యులు పిళ్లా పోతరాజు, పి.వెంకటరమణ, పిళ్లా అప్పన్న, జగుపిల్లి అప్పారావు, యస్.శ్రీను, పిళ్లా లక్ష్మణ పాత్రుడు, సూరి పాత్రుడు, జి.కామేశ్వరరావు, అప్పారావు , శ్రీను, వినోద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.