శిల్పారామం అధికారి విశ్వనాథ రెడ్డికి కు జాతర గట్టు చందంపాలెం దుర్గాలమ్మ ఆలయ ప్రాంగణంలో సన్మానం

శిల్పారామం ఎఓ విశ్వనాథ్ రెడ్డి దంపతులకు చిరు సత్కారం! (మధురవాడ, ప్రజా బలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్: మానం శ్రీను ) మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి అమ్మవారి కమిటీ సభ్యులు శిల్పారామం ఎఓ టి.విశ్వనాధరెడ్డి, శోభారాణి దంపతులను శనివారం ఘనంగా సత్కరించారు, గత ఏడు సంవత్సరాలగా శిల్పారామం ఎఓ పనిచేసిన విశ్వనాథ్ రెడ్డిని ఇటీవల పులివెందులకు బదిలీ చేశారు. ఆయన పులివెందుల బయలు దేరుతున్న సందర్భంగా శ్రీదుర్గాలమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, హరిచరణ్ తదితరులు వారికి ఆశీర్వాదం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు, ఈ సందర్భంగా విశ్వనాథరెడ్డి దంపతులను దుశ్యాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదుర్గాలమ్మ ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పి.వి.జి.అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ పిళ్లా మోహన్ శివకృష్ణ, కమిటీ సభ్యులు పిళ్లా వెంకటరమణ, పొట్నూరి హరికృష్ణ, సింహాచలం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, చంద్రంపాలెం గ్రామ పెద్దలు పీస రామారావు, ముఖ్య సభ్యులు పిళ్లా పోతరాజు, పిళ్లా అప్పన్న, పోతిన రాంబాబు, డి.అప్పారావు, మధురవాడ పాత్రికేయులు ఎ.సాంబశివరావు, బి.ఆనంద్ తదితరులు ఉన్నారు, ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ విశ్వనాథ్ రెడ్డి మధురవాడ శిల్పారామం ఎఓ వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎంతో అభివృద్ధి పధంలో నడిపించారని, శిల్పారామంకి ఈశాన్య భాగంలో శ్రీ దుర్గాలమ్మ ఆలయం ఉండడం వలన ఆలయానికి ఆయన అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారని కొనియాడారు.