భగత్ సింగ్ రాజ్ గురు సుఖుదేవ్ అమరవీరులుచేసిన త్యాగాలే మన స్వేచ్ఛ వాయువులు..
March 23, 2025
అమరులు త్యాగాలు వృథా కానివ్వం.ప్రజా సంఘాలు.. మజ్జిగ పంపిణీ. (మధురవాడ ప్రజాబలం
న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) సి ఐ టీ యు,ఐద్వా,డీ వై ఎఫ్
ఐ,బాలల సంఘం,ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్,సుఖ్ దేవ్, రాజ్ గురు ల వర్ధంతి
సందర్భంగా ఆదివారం మధురవాడ, మార్కెట్ కూడలి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.ముందుగా
అమరుల చిత్రపటానికి వార్వ,నివాస్ సంఘాల నాయకులు బొత్స నరసింహ మూర్తి,గుర్రాల రఘు
రామ్ పువల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
స్వాతంత్రోద్యమ పోరాటం లో బ్రిటిష్ సామ్రాజ్య వాదుల గుండెల్లో దడ పుట్టించిన గొప్ప
వీరులు భగత్ సింగ్,రాజ్ గురు,సుకుదేవ్ లని కొనియాడారు.వారి త్యాగాల ఫలితమే మనమీనాడు
అనుభవిస్తున్న స్వేచ్చా వాయువులని తెలియజేశారు .వారు మన దేశంలో సమ సమాజం నిర్మించడం
కోసం కృషి చేశారని అన్నారు .వారి కృషిని మనం కొనాగించడమే వారికిచ్చే నిజమైన
నివాళులు అని తెలియ చేసారు.అనంతరం మధ్యాహ్నం వరకు మజ్జిగ పంపిణీ చేశారు.పలువురు ఈ
కార్యక్రమాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు జీ కిరణ్,డీ
కొండమ్మ,సీహెచ్ శేషుబాబు, ఎల్ పద్మ,బి ఉష,డీ ఉమా శైలు, జి మంగ శ్రీ, మేఘన,డీ
అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.