ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి,k2 జే ఎన్ ఎన్ యు ఆర్ ఎం కాలనీలో పర్యటించిన సిపిఎం కార్పొరేటర్ గంగారాం

కే 2 కాలనిలో పేరుకు పోయిన సమస్యలు పరిష్కారం చెయ్యాలి.సిపిఎం.. (భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) పేద,దినసరి వేతనాలతో జీవిస్తున్న కొమ్మాది 2, జే ఎన్ ఎన్ యు ఆర్ ఎం కాలని లో ప్రజలను సమస్యలు పీడిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు,78 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రలలోభాగంగా కే 2 కొలనీ మంగళ వారం సిపిఎం మధురవాడ ప్రాంత నాయకులతో కలిసి గంగారావు ఇంటింటికీ తిరిగి ప్రజల ను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.కాలని నిర్మాణం దశలోనే నాణ్యతా, ప్రమాణాలు పాటించక పోవడం వలన కాలనిలో నివసిస్తున్న ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీసం త్రాగడానికి మంచినీరు సరఫరా చేయక పోవడం అన్యాయం అని అన్నారు.764 గృహాలున్న కాలనిలో కనీస సదుపాయాలు లేవని అన్నారు.పారిశుధ్య,యు జి డీ సమస్య అధ్వానంగా ఉందని తెలియ జేశారు. పేదలు నివసించే ఇలాంటి కాలనీలలో పర్యటించి,సమస్యలు పరిష్కారం కోసం ప్రజలను కదించీ పోరాటం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డీ అప్పలరాజు,పీ రాజు కుమార్,కే వెంకట అప్పారావు,కార్యకర్తలు ఎల్ పద్మ, వై అప్పన్న,యశిన్ బాబా,శైలజ,పూర్ణ తది తరులు పాల్గొన్నారు.