కెవిపి ఎస్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావ్ 118వ జయంతి.,
April 05, 2025
దళిత,బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్.
(మధురవాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
భారత దేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వాదం కు వ్యతిరేక పోరాటం లో నాయకత్వం వహించిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజీవన రామ్ అని వక్తలు కొనియాడారు.బాబు జనజీవన్ రామ్ 118 వ జయంతి సందర్భంగా 7 వ వార్డు శనివారం రిక్షా కాలనీ లో మాదిగ జన సంక్షేమ సంఘం,కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కే వి పీ ఎస్) కాలనీ వాసులు ఘనంగా నివాళులు అర్పించారు.ముందుగా మాదిగ జన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పీ చిన్నారావు, కేవీపీఎస్ నాయకులు డి అప్పలరాజు జగ జీవన రామ్ చిత్ర పటానికి పువల మాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం వక్తలు మాట్లాడుతూ మన దేశంలో దళిత భహు జనులు కోసం పాటుపడిన నాయకులు చాల అరుదు అని అన్నారు. బాబు జగ జీవన్ రామ్ తను చేపట్టిన మంత్రి పదవుల ద్వారా కార్మికులకు, కష్ట జీవలకు అనేక ప్రయోజనాలు సమకూర్చడమే కాకుండా,కార్మిక హక్కుల కోసం అనేక చట్టాలు రూపొందించారని తెలియ జేశారు.నేటి బీజేపీ పాలకులు ఆ చట్టాలకు,హక్కులకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు.బీజేపీ పాలనలో కష్ట జీవులకు,దళితులకు,మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.బాబు జగ జీవన్ రామ్ త్యాగాలు,పోరాట పటిమను అనుసరించాలని ఈ సందర్భంగా కోరారు. ఎగ్జి క్యూటీవ్ సభ్యులు మామిడి శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కే పుష్ప,పీ చంటి, సి ఐ టీ యు కార్యకర్తలు జీ లలిత,సురేష్, ఏ మురళీ, ఏ మాధవ తదితరులు పాల్గొన్నారు.