వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 20 కుర్చీల వితరణ.
April 05, 2025
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మాన0శ్రీను మధురవాడ
ఓం శ్రీ సాయిరాం...
జై వాసవి.
వాసవి క్లబ్ ఎం.వి.పి.కపుల్స్ ఆధ్వర్యంలో ఈ దినం తేదీ 05.04.2025 శనివారం ఉదయం 9.00 గంటలకు శ్రీ శ్రీ శ్రీ సీతారామ సాగర లింగేశ్వర ఆలయం నకు ఆలయ కమిటీ వారి అభ్యర్థన మేరకు శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని 20 కుర్చీలు ముఖ్యఅతిథిగా వచ్చిన రీజినల్ ఛైర్పర్సన్ వాసవియన్ తిరుపతి రావు గారికి ముందుగా సాలువతో సన్మానించి వారి సమక్షంలో ఆలయ కమిటీ వారికి బహుకరించడమైనది. రీజనల్ సెక్రటరీ వాసవియన్ పుష్పలత, జోన్ చైర్ పర్సన్ వాసవియన్ గోగుల కమల్ కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకట రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వాసవియన్ కె. వెంకటరమణమూర్తి, కోశాధికారి వాసవియన్ పి చంద్రశేఖర్ గుప్తా, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ గారు, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వాసవియన్ గ్రంధి వాసుదేవ మూర్తి గారు, మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. USA నివాసతులైన డాక్టర్ గట్ట ప్రకాష్ గారు సహకారంతో కుర్చీలు ఇవ్వడం జరిగింది. దాత ప్రకాష్ గారికి మరియు ముఖ్య అతిథులకు హాజరైన సభ్యులకు క్లబ్ అధ్యక్షులు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసినారు.