వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 2025 మెగా కెరీర్ గైడెన్స్ సమ్మిట్.. ప్రతిభావంతులైన పేద విద్యార్థు లను దత్తత తీసుకున్న కాలేజీ యాజమాన్యాలు.

వాసవి క్లబ్స్ వారిచే మెగా కెరీర్ గైడెన్స్ సమ్మిట్-2025 (విశాఖ సిటీ : ప్రజా బలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) అంతర్జాతీయ వాసవి క్లబ్స్ జిల్లా వి201ఏ వారిచే మెగా కెరీర్ గైడెన్స్ సమ్మిట్-2025 ను అంబేద్కర్ భవన్ లో డాక్టర్ పి.సతీష్ నాయకత్వంలో ఆదివారం గ్రేటర్ విశాఖ కపుల్స్ వారి ఆద్వర్యంలో నిర్వహించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్,డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు విశాఖ,విజయనగరం, అనకాపల్లి,శ్రీకాకుళం జిల్లాల నుంచి సుమారు రెండు వేల మందికి పైగా హాజరై వారి యెక్క భవిష్యత్తు విద్యా ప్రణాళికకు బాటలు ఏర్పరుచు కున్నారు. వారి యెక్క కెరీర్ ని నివృత్తి చేసుకున్నారు. ఇందులో 22 విద్యా సంస్థలు పాల్గున్నాయి. ప్రతిభావంతులైన నలుగురు పేద విద్యార్థులను ఉన్నత చదువులకై అలియన్స్ కాలేజ్, హర్ష పర్ఫెక్ట్ సొల్యూషన్స్ వారు దత్తత తీసుకున్నారు. ముఖ్య అతిధులుగా మాజీఅంతర్జాతీయ అధ్యక్షులు గుప్తా, జిల్లా గవర్నర్ అమర్నాధ్ ,కార్యదర్శి సాయి నిర్మల,కోశాధికారి చెరకు కృష్ణ, పద్మావతి,డాక్టర్ రజని,స్వప్న,రాధిక తదితరులు పాల్గున్నారు.