ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దీపికకు 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన భీమిలి వైసిపి సమన్వయకర్త చిన్న శ్రీను. తమ పార్టీ కార్యకర్తలను తోడ్కొని దీపికను పరామర్శించిన చిన్న శ్రీను. బాధిత దీపికను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.
April 07, 2025
విశాఖ పట్నం మేడి కవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దీపిక ని పరామర్శించిన విజయనగరం జిల్లాజడ్పీ చైర్ పర్సన్ చిన్న శ్రీను.
భీమిలి నియోజకవర్గం, మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :
విశాఖపట్నం జిల్లా మధురవాడ . 5వ వార్డు స్వయంకృషి నగర్ లో ఓ ప్రేమోన్మాది యువతపై దాడి చేసిన సంఘటనలో దీపిక అనే యువతి ప్రాణాపాయ స్థితిలో ఉండడం తో, విశాఖపట్నం మెడి కవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దీపికను సోమవారం విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, భీమిలి నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు( చిన్న శ్రీను) . బాధితురాలికి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.,మా పార్టీ తరఫున అన్ని విధాల బాధితురాలును ఆదుకుంటామని తెలియజేశారు. 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయన అందించారు.
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు ఇటీవల విజయనగరం, మధురవాడ ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏపీలో శాంతిభద్రతలు లోపించాయి.
దిశ యాప్ నిర్వీరం చేస్తున్నారు. మహిళా పోలీస్ స్టేషన్లో వర్క్ చేయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమాల్లో అరకు పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి తనుజారాణి. శాసనమండలి సభ్యులు సభ్యురాలు శ్రీమతి వరద కళ్యాణి ,పేడాడ రమణ కుమారి, 5 వ వార్డ్ వైస్సార్సీపీ అధ్యక్షులు పోతిన హనుమంతరావు, పోతిన శ్రీనివాస రావు. చేకూరి రజిని తదితరులు పాల్గొన్నారు..