ఎంవిపి సిటీ వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షులు రామకృష్ణ, నాగవేణి పుణ్యదంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా నిరాశ్రయులైన 50 మంది చిన్నారులకు ఆహారం ప్యాకెట్లు వితరణ.
April 21, 2025
విశాఖపట్నం (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ.)
ఓం శ్రీ సాయిరాం...
జై వాసవి... 20.04.2025 ఆదివారం త్యాగం ఫౌండేషన్ చెన్నై (తమిళనాడు) నిర్వహణలో నిరాశ్రయులైన చిన్నపిల్లల వసతి గృహమునందు విశాఖపట్నం, వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ఆధ్వర్యంలో శ్రీమతి అండ్ శ్రీ వాసవియన్ రామకృష్ణ నాగవేణి వివాహ వార్షికోత్సవము పురస్కరించుకొని
50 మంది చిన్న పిల్లలకు ఆహారం ప్యాకెట్స్ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు ఏవి రామకృష్ణారావు తెలియజేసినారు. ఇంత చక్కటి ఫౌండేషన్ పిల్లలకు వృద్ధులకు అందరికీ ఏర్పాటుచేసి సేవలు చేస్తున్న త్యాగం ఫౌండేషన్ చెన్నై తమిళనాడు యాజమాన్యానికి, అధ్యక్షులు కృతజ్ఞతాభివందనములు తెలిపినారు.