జీవీఎంసీ 7వ వార్డు చంద్రంపాలెం జాతర గట్టు దుర్గాలమ్మ ఆలయ ప్రాంగణం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. అనంతరం మధ్యాహ్నం స్వామివారి (శోభాయాత్ర) భారీ ర్యాలీ.

చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం నుండి హనుమాన్ విజయోత్సవ యాత్ర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం, భీమిలి నియోజకవర్గం,మధురవాడ --- ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకునిగా ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుండి హనుమాన్ విజయోత్సవ దినం సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభమైంది, జై శ్రీరామ్ జైజై శ్రీరామ్, జై హనుమాన్ జైజై హనుమాన్ అనే నామముతో శోభాయాత్ర శ్రీ దుర్గాలమ్మ ఆలయం నుండి బయలుదేరి మధురవాడ జంక్షన్ చంద్రంపాలెంలో అన్ని వీధులు తిరుగుతూ, కారు షెడ్ జంక్షన్, జూ పార్క్ జోడుగుళ్లపాలెం అప్పుగర్, ఉడా పార్కు మీదుగా ఆర్.కె.బీచ్ కి ఈ విజయోత్సవ ర్యాలీతో శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ముందుగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు సింధూరార్చన, నాగవళ్లీ ధళార్చన ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, హరిస్వామి నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనం మంత్ర పుష్పం సమర్పించి శోభాయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ విజయోత్సవ శోభాయాత్రలో ధర్మకర్త పిల్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లా సూరిబాబు ఉపాధ్యక్షులు సెక్రెటరీ నాగోతి తాతారావు, చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిల్లా శ్రీను, నాని, సంకాబత్తుల సతీష్, మానం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు..