ఘనంగాముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు, పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన ఆరువ వార్డు టిడిపి అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్

భీమిలి నియోజకవర్గ0, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను పాత మధురవాడ మెట్ట ) జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు 75వ జన్మదిన సందర్భంగా ఆరో వార్డు పీఎం పాలెం పార్టీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి. ముందుగా పార్టీ కార్యాలయం వద్ద కేక్ కటింగ్ చేసి అనంతరం వార్డు అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ సహకారంతో శానిటేషన్ సిబ్బంది అందరికీ ఆడవారికి చీరలు మగవారికి ప్యాంటు షర్టు అలాగే పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు బలరా మూర్తి, సర్వ దేవుళ్ళు, షేక్ సుభాని, పెంటకోట బబేలు నోడగల జానకిరామ్ , సుంకరరాజు, జహనారా, ఉమా శంకర్ వర్మ కంచర్ల ప్రతాప్, కోరగంజి సూరిబాబు, భాష, వార్డు ముఖ్య నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది.