ఎంవిపి కాలనీ --- వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ కు* ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డ్..* అవార్డు అందుకుంటున్న....అధ్యక్షుడు రామకృష్ణ బృందం
April 10, 2025
వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ నకు
*సర్వీస్ ఎక్స్లెన్స్ అవార్డ్*:
వాసవి క్లబ్ వి 201ఎ విశాఖ జిల్లా రెండవ కేబినెట్ సమావేశం
తేదీ 10.04.2025 న విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో అద్భుతంగా జరిగినది.ఈ సమావేశములో వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ వారు చేసిన సేవలకు, ప్రత్యేకించి మెగా రక్తదాన శిబిరంలో చేసిన సేవలను గుర్తించి, ఈ సమావేశం నకు ముఖ్య అతిథిగా వచ్చిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కార్యదర్శి వాసవియన్ విద్యాసంకల్ప కెసిజిఎఫ్ గర్లపాటి శ్రీనివాసులు గారు క్లబ్ అధ్యక్షులు వెంకట రామకృష్ణారావుకు అందజేసినారు.. అవార్డు రావడానికి తగు సూచనలు సలహాలు ఇచ్చిన జోన్ చైర్ పర్సన్ గోగుల కమల్ కుమార్ గారికి, రీజన్ సెక్రెటరీ పుష్పలత గారికి మరియు రీజియన్ చైర్ పర్సన్ తిరుపతి రావు గారికి, గవర్నర్ అమర్నాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు .మా క్లబ్ సభ్యులు అందరి సహకారంతో చేసిన సేవలకు గుర్తింపు గా వచ్చిందని, అవార్డు రావటం చాలా ఆనందదాయకమని,ఇలాంటి అవార్డ్లు ఇంకా ఎన్నో పొందాలని దానికి క్లబ్ సభ్యులు అందరూ సహకరించి అన్ని సేవలలో పాల్గొనాలని కోరుకుంటూ అందరికీ పేరుపేరునా అధ్యక్షులు ధన్యవాదములు తెలిపినారు.ఈ సమావేశంనకు క్లబ్ ప్రధాన కార్యదర్శి వాసవియన్ కె. వెంకట రమణ మూర్తి గారు, కోశాధికారి వాసవియన్ చంద్రశేఖర గుప్తా హాజరైనారు.